
అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఫినిషర్ గా తిరుగులేని వికెట్ కీపర్ గా కూడా ధోని ప్రస్తానాని కొనసాగించాడు అని చెప్పాలి. అందుకనే ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతనికి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అయితే ధోని అందరిలాగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండడు.. అభిమానులతో ఇంటరాక్ట్ అవడం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ధోని ఎక్కడైనా కనిపించాడంటే చాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు అభిమానులు. ధోని గురించిన వార్త ఏది తెర మీదికి వచ్చిన హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.
ఇకపోతే ఇటీవలే మహేంద్ర సింగ్ ధోని ఓ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. కేరళలో ఒక ప్రొఫెసర్ రాసిన పుస్తకాన్ని ధోని విడుదల చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ధోని తాను స్కూల్లో ఉన్నంతకాలం టీచర్లకు పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టీచింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అని ధోని తెలిపాడు. అయితే కాలేజీ సమయంలో మాత్రం ఎప్పుడూ తాను ఎప్పుడు క్లాస్కు వెళ్లలేదని కానీ బాగా చదివే వాడిని అంటూ ధోని చెప్పుకొచ్చాడు.