దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన పృథ్వి షా మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేశాడు. ఇక వచ్చిన తర్వాత కూడా తనదైన రీతిలోనే మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక తక్కువ సమయంలోనే క్రికెట్ లెజెండ్ సచిన్ వారసుడు అంటూ ఒక ట్యాగ్ కూడా సంపాదించుకున్నాడు పృథ్వి షా. ఇలా కొన్నాళ్లపాటు బ్యాటింగ్లో మెరుపులు మెరిపించిన పృథ్వి షా  ఆ తర్వాత మాత్రం నిలకడలేమిటో ఇబ్బంది పడ్డాడు.


 ఇక కొన్నాళ్లపాటు అతనికి అవకాశాలు ఇచ్చి చూసిన టీమిండియా యాజమాన్యం.. ఆ తర్వాత పక్కన పెట్టేసింది. దీంతో ఇక అతనికి ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కడం చాలా కష్టంగా మారిపోయింది. క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన అతన్ని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవడం లేదు టీమిండియా సెలెక్టర్లు. ఈ క్రమంలోనే  టీమ్ ఇండియా సెలెక్షన్ జరిగిన ప్రతిసారి జట్టులో స్థానం కోసం ఎదురుచూడటం.. ఇక జట్టులో అతని పేరు లేకపోవడంతో తన నిరాశను సోషల్ మీడియా వేదిక వ్యక్తపరచడం చేస్తూ వస్తున్నాడు పృథ్వి షా. అయితే ఇలా టీమ్ ఇండియాలోకి సెలక్ట్ చేయట్లేదు అన్న కోపమో.. లేదా ఇంకేంటో తెలియదు కానీ ఇటీవల రంజీ ట్రోఫీలో పృథ్వి షా దంచి కొట్టాడు.


 ఇక రంజీ ట్రోఫీలో భాగంగా డబుల్ సెంచరీ చేసి తన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఇటీవలే అస్సాం, ముంబై మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ఇక ముంబై జట్టులో ప్లేయర్గా కొనసాగుతున్న పృథ్వి షా 235 బంతులు ఎదుర్కొని 28 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 20 పరుగులు చేశాడు అని చెప్పాలి. దీంతో ఇక పృథ్వి షా చేసిన డబుల్ సెంచరీ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. చూడండి పృద్విషా డబల్ సెంచరీ చేశాడు. ఇప్పటికైనా భారత జట్టులోకి సెలెక్ట్ చేస్తారా అని అతని అభిమానులు ఇక పృద్విషా డబుల్ సెంచరీ తర్వాత బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: