
ఆ తర్వాత టీమ్ ఇండియాలో అవకాశం దక్కించుకుని వచ్చిన అవకాశాలను ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. తద్వారా ఇక నేటి రోజుల్లో మంచి ప్రతిభగల యువ ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయాడు. అయితే మొన్నటికి మొన్న శ్రీలంకతో భారత జట్టు ఆడిన టి20 సిరీస్లో ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్ తుదిజట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇకపోతే ఇక ఇటీవల భారత జట్టు వన్డే సిరీస్ ఆడుతుండగా రుతురాజ్ రంజీ ట్రోఫీలో భాగమయ్యాడు.
ఈ క్రమం లోనే రంజి ట్రోఫీలో భాగంగా ఇటీవల తమిళనాడు తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు ఓపెనర్ గా బరి లోకి దిగిన టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. 126 బంతుల్లో 118 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి అని చెప్పాలి. ఇక అతనితోపాటు గత మ్యాచ్ లో డబుల్ సెంచరీ హీరో కేదార్ జాదవ్ కూడా 56 పరుగులతో రాణించాడు అని చెప్పాలి. ఏది ఏమైనా ఇక రుతురాజు గైక్వాడ్ సెంచరీ తో చెలరేగిపోవడంతో ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.