టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇక ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెల్లవారుజామున ఉత్తరాఖండ్లో ఉన్న తన తల్లిని కలిసేందుకు వెళ్తున్న రిషబ్ పంత్ రూర్కి ప్రాంతంలో చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో అతని కారు పూర్తిగా కాలి బూడిదైపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాపాయం లేకుండా గాయాలతో బయటపడగలిగాడు పంత్. అయితే ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.


అతను త్వరగా కోలుకోవాలని అటు అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రిషబ్ పంత్ వేగంగానే గాయాలనుంచి రికవరీ అవుతున్నాడని బీసీసీఐ కూడా ప్రకటన చేసింది. అయితే అతను ఎప్పటి వరకు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అన్నది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. రిషబ్ పంత్ గాయాలు నేపథ్యంలో దాదాపు 6 నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉండే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఆడబోయే కీలక సిరీస్ లతోపాటు ఇక ఐపీఎల్ కు కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉందని భావించారు.


 కాక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇక ఐపీఎల్ ప్రారంభం నాటికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదని అంచనా వేశారు. కాగా పంత్ విషయంలో  అనుకున్నదే జరిగింది. ఐపీఎల్ సమయానికి  పంత్ అందుబాటులో ఉండబోడు అంటూ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం డైరెక్టర్ సౌరబ్ గంగూలీ అధికారిక ప్రకటన చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అతను కోలుకోవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని అందుకే ఐపీఎల్ కు దూరంగా ఉంటాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు సౌరబ్ గంగూలీ.

మరింత సమాచారం తెలుసుకోండి: