ఇటీవల కాలంలో దేశవాళి టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో భాగంగా ఆటగాళ్లు ఎంతలా అదరగొడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే కాదు భారత జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ప్లేయర్లు సైతం ఇక సెంచరీలు చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల వెటరన్ టీమిండియా ప్లేయర్ విజయ శంకర్ సైతం వరుసగా రెండు సెంచరీలు చేయడం గమనార్హం.


 రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడు తరఫున బరిలోకి దిగిన విజయ్ శంకర్ ఇటీవలే పూణే వేదికగా మహారాష్ట్ర, తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్లో కూడా వరుసగా రెండో సెంచరీ సాధించాడు అని చెప్పాలి. ఇక అంతకు ముందు ముంబై తో జరిగిన మ్యాచ్లో కూడా 214 బంతుల్లో 10 ఫోర్ ల సహాయంతో 107 పరుగులు చేశాడు విజయ శంకర్. ఇక ఇలా విజయ శంకర్ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్న నేపథ్యంలో టీమిండియా వెటరన్  ప్లేయర్ అయిన అంబటి రాయుడు పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.


 గతంలో 2019 వరల్డ్ కప్ సమయంలో అంబటి రాయుడుకు బదులు ఇక విజయ శంకర్ ను ఎంపిక చేశాడు అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్. అప్పట్లో ఇది కాస్త అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక విజయ శంకర్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్లో రాణిస్తాడని అతను 3d ప్లేయర్ అంటూ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ తర్వాత ఇక ఇదే కామెంట్స్ పై కౌంటర్ ఇస్తూ త్రీడి గ్లాసెస్ పెట్టుకొని నేను మ్యాచ్ చూస్తా అంబటి రాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో ఇక ఇప్పుడు విజయ శంకర్ సెంచరీ చేసిన నేపథ్యంలో 3d ప్లేయర్ అనే పోస్ట్ కాస్త మరోసారి వైరల్ గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: