2023 ఏడాదిలో భారత జట్టు వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతుంది అనే విషయం తెలిసిందే. కాగా ఇందులో మూడు ఫార్మట్లకు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్ లు ఉండడం గమనార్హం. అయితే ఈ సిరీస్లలో కొన్ని విదేశీ పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా మరికొన్ని ఇక విదేశీ జట్లు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆడాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక భారత పర్యటనకు రాబోతున్న ఆస్ట్రేలియా జట్టుతో కూడా టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది టీమ్ ఇండియా జట్టు.  ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడబోయే జట్టు వివరాలను కూడా ఇటీవలే ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్ పై టెస్టు సిరీస్లో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అర్హత సాధించేందుకు అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇక మరోవైపు టీమ్ ఇండియాకు మూడవ స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి పోటీ ఉంది అని చెప్పాలి. అయితే ఎలాంటి పోటీ లేకుండా టీమ్ ఇండియా అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో అడుగు పెట్టాలంటే భారత పర్యటనకు  వచ్చే ఆస్ట్రేలియా పై తప్పక విజయం సాధించాల్సి ఉంది.


 టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుందో అనే ఎంతోమంది అంచనాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే టీమ్ ఇండియాతో జరిగే టెస్ట్ సిరీస్ గురించి ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ లభూషేణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చెప్పుకోచాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్ ఎదుర్కోవడం కోసం ఆటతీరులో కాస్త మార్పు చేసుకున్నానని..అశ్విన్ ప్రణాళికలను విఫలం చేయడానికి కసరత్తులు చేస్తున్నాను. ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ చదరంగం మ్యాచ్ల సాగడం ఖాయం అంటూ లబుషేన్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: