రంజి ట్రోఫీ చరిత్రలో తిరుగులేని ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ముంబై జట్టు. ఇక ఇప్పటివరకు ఎక్కువసార్లు రంజీ ట్రోఫీ అందుకున్న జట్టుగా కూడా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. ఇక ప్రతి రంజీ సీజన్లో కూడా భారీ అంచనాల మధ్య టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అంచనాల తగ్గట్లుగానే రాణిస్తూ అభిమానులను సంతృప్తి పరుస్తూ ఉంటుంది ముంబై. అయితే ఇటీవలే రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది.


 కాగా ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. అది కూడా ఏకంగా 41 సార్లు  రంజి చాంపియన్గా నిలిచిన ముంబై జట్టుని ఢిల్లీ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించడం గమనార్హం. ఇక నలభై మూడు ఏళ్ల రంజి చరిత్రలో ముంబై జట్టు పై ఢిల్లీ విజయకేతనం ఎగరవేయడం ఇదే తొలిసారి . అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ తో కలిపి ఢిల్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడగా మూడింటిని డ్రాగ ముగించింది. ఇక రెండింటిలో ఓటమిపాలు అయింది. ఇక ఇటీవలే ఆరో మ్యాచ్లో పటిష్టమైన ముంబై పై విజయకేతనం ఎగరవేసి తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో 80 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం.


 అయితే ప్రస్తుతం గ్రూపు బి లో ఉన్న ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో కొనసాగుతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో తోలుత బ్యాటింగ్ చేసింది ముంబై. తొలి ఇన్నింగ్స్ లో 293 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది.  దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం లభించింది. రెండవ ఇన్నింగ్స్ లో ముంబై 170  పరుగులకే కుప్పకూలింది . ఇక ఢిల్లీ 97 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగి రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని బద్దలు కొట్టింది. అయితే ఇక ఈ ఓటమి ఛాంపియన్ ముంబై జట్టుకు అవమానం లాంటిదే అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: