ఈ రోజు రాయపూర్ వేదికగా జరుగుతున్న రెండవ వన్ డే లో ఇండియా జోరు కొనసాగుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్ డే సిరీస్ ను గెలుచుకునేలా ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే సిరీస్ లో 0 - 1 తో వెనుకబడిన కివీస్ జట్టు ఆశించిన మేరకు ఆడడంలో సమిష్టిగా విఫలం అయింది. సీనియర్లు కెన్ విలియమ్సన్ , టిమ్ సౌథీ మరియు బౌల్ట్ లు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రెండవ వన్ డే లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ నమ్మకాన్ని ఇండియా బౌలర్లు 100 శాతం నిలబెట్టుకున్నారు. గత రెండు సిరీస్ ల నుండి బుమ్రా భువి లు లేకపోయినా కుర్రాళ్లతో కలిసి షమీ పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నాడు.

ఈ రోజు మొదటి పవర్ ప్లే లోనే కివీస్ ఓటమిని ఖరారు చేశారు. ఇండియా బౌలర్లు షమీ మరియు సిరాజ్ లు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ ను చెమటలు పట్టించారు. క్రీజులో నిలవాలంటే భయపడేలా మన బౌలింగ్ కొనసాగింది. కివీస్ లో ఎనిమిది మంది బ్యాట్స్మన్ లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. అలా న్యూజిలాండ్ కేవలం 34 .3 ఓవర్ లలో పరుగులకే చాప చుట్టేసింది. కివీస్ ఆటగాళ్లలో ఫిలిప్స్ 36 , శాంట్ నర్ 27 మరియు బ్రెసెవెల్ లు 22 మాత్రమే రెండంకెల స్కోర్ ను చేయగలిగారు.

ఇండియా బౌలర్లలో షమీ అత్యధికంగా మూడ్ వికెట్లు తీసుకుని కివీస్ నడ్డి విరిచాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్య మరియు సుందర్ లు తలో రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్ , శార్దూల్ మరియు కుల్దీప్ లు తలో వికెట్ తో సరిపెట్టుకున్నారు. దీనితో ఇండియా ముందు కేవలం 109 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. ప్రస్తుతం ఇండియా ఆటగాళ్ళు ఉన్న ఫామ్ కు 20 ఓవర్ లలోపే ఈ స్కోర్ ను చేధించే అవకాశం ఉంది. మరి చూద్దాం ఈ తక్కువ టార్గెట్ లో గిల్ మరోసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడుతాడా ?

మరింత సమాచారం తెలుసుకోండి: