
ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేయడమె లక్ష్యంగా బౌలర్ల పై వీరవిహారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో భాగంగా ఇప్పటివరకు అలెక్స్ హేల్స్ ఆడిన నాలుగు మ్యాచ్లలో కూడా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. అంతేకాదు ఒక సెంచరీ కూడా చేసి 356 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే గల్ఫ్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కూడా మరోసారి తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగించాడు. కానీ కేవలం ఒకే ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు అని చెప్పాలి. 57 బంతుల్లోనే 10 ఫోర్లు ఐదు సిక్సర్ల సహాయంతో 99 పరుగులు చేశాడు అలెక్స్ హేల్స్.
అయితే ఇక అతను సెంచరీ పూర్తి చేయడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో ఒక్క పరుగు దూరంలో చివరికి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయి అభిమానులందరినీ కూడా నిరాశపరిచాడు. ఇక అతను అద్భుతమైన ఇన్నింగ్స్ తో డిసర్ట్ వైపర్స్ జట్టు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలోనే తర్వాత లక్ష్య చేదనకు దిగిన గల్ఫ్ జట్టు చివరికి లక్ష్యాన్ని చేదించలేక ఓడిపోయింది అని చెప్పాలి. కాగా అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.