క్రికెట్ అనే పుస్తకంలో ఎన్ని రకాల షాట్లు ఉన్నాయో ఇక అన్ని రకాల షాట్లను కొట్టి తాను ఒక లెజెండరీ క్రికెటర్ను అని నిరూపించుకున్న సచిన్ టెండూల్కర్ ఎంతోమంది క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఇక తన అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుని క్రికెట్ దేవుడిగా మారిపోయాడు. ఇక ఇప్పటికీ కూడా నేటి జనరేషన్ క్రికెటర్లు సైతం సచిన్ సాధించిన రికార్డులను ఇప్పటికీ బ్రేక్ చేయలేకపోతున్నారు. అంతేకాదు అతని రికార్డులకు ఇక ఎంతో దూరం ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు ఎవరైనా ఆటగాళ్లు మైదానం నలువైపులా షాట్లు ఆడితే చాలు ఇక వారిని మిస్టర్ 360 ప్లేయర్ అని పిలుచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఎవరికి సాధ్యం కాని రీతిలో మైదానం నలువైపులా అన్ని రకాల షాట్లను ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. ఇలా అన్ని షాట్లను ఎంతో అలవోకగా ఆడే సచిన్ టెండూల్కర్ కి ఒక షాట్ అంటే మాత్రం అస్సలు ఇష్టం లేదట. అయితే ఆ షాట్ ను సచిన్ ఇష్టపడక పోవడానికి కారణం అతను రన్ అవుట్ కావడమే అన్నది తెలుస్తుంది.


 ఇటీవలే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్, జూబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి గాను మాజీ క్రికెటర్లు ఆకాష్ చోప్రా, ఆర్పి సింగ్ వ్యాఖ్యతలుగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచిన్ తో ఆడినప్పటి సంగతులను మాజీ ఫేసర్ ఆర్పి సింగ్ గుర్తు చేసుకున్నాడు. నేను బౌలింగ్ చేసేటప్పుడు ఎవరిని రనౌట్లు చేసానో గుర్తులేదు. కానీ బ్యాటింగ్లో మాత్రం కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ దెబ్బకు నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న దిగ్గజా క్రికెటర్ సచిన్ రన్ అవుట్ రూపంలో వికెట్ కోల్పోయాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ ను రనౌట్ చేసిన దానిపై ఆర్పి సింగ్ ఇటీవల క్షమాపణలు చెప్పాడు. అయితే ఇదే విషయంపై స్పందించిన సచిన్ నా కిష్టమైన షాట్స్ జాబితాలో స్ట్రైట్ డ్రైవ్ లేకుండా పోయింది. ఆర్పి సింగ్ బ్యాటింగ్ తోను వికెట్లు తీయగలడు అంటూ నవ్వుతున్న ఎమోజిని పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: