
అంతేకాదు మహిళా క్రికెటర్లకు ఉన్న ఆదరణను మరింత పెంచేందుకుగాను ఇక ఉమెన్స్ క్రికెటర్లకు ఐపీఎల్ నిర్వసిస్తున్నట్లుగానే అటు ఉమెన్స్ క్రికెటర్లకు కూడా ఈ ఏడాది నుంచి ఐపిఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది అన్న విషయం తెలిసిందదే. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అన్ని సన్నాహాలను పూర్తి చేస్తుంది బీసీసీఐ. ఇకపోతే ఇక ఐపీఎల్ లో ఆయా జట్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలను కూడా ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.
మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే అటు ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా బీసీసీఐకి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళల ఐపీఎల్ జట్ల వేలంతో బీసీసీఐ దాదాపు 4వేల కోట్లు ఆదాయం ఆర్జించబోతున్నట్లు తెలుస్తుంది. జట్లను కొనుగోలు చేసేందుకు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. ఒక్కో జట్టు 5 నుంచి 600 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉందని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారని చెప్పాలి. కాగా నేడు ఉమెన్స్ ఐపీఎల్ మెగా వేలం జరగబోతుంది ఇందులో పాల్గొనేందుకు 30కి పైగా సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయ్ అని చెప్పాలి. ఇక వీటిలో అదాని గ్రూప్, కొటక్ గ్రూప్, ఆదిత్య అండ్ బిర్లా గ్రూప్ లాంటి బడాబడా సంస్థలు కూడా ఉండడం గమనార్హం.