
రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఇక వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ గెలుచుకుని న్యూజిలాండ్ను క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇదే జోరుతో టి20 సిరీస్ ప్రారంభించేందుకు సిద్ధమైంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే ఈ టి 20 సిరీస్ కోసం అటు భారత అభిమానులు అందరూ కూడా వేయకళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే హార్థిక్ పాండ్య కెప్టెన్సి లో టి20 సిరీస్ లో భాగంగా యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా బరిలోకి దిగిపోతుంది అని చెప్పాలి.
అయితే ఇక న్యూజిలాండ్తో జరగబోయే టి20 సిరీస్ కు భారత జట్టు సన్నద్ధమవుతున్న వేళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమ్ ఇండియా లో యంగ్ ఓపెనర్ గా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఇక టి20 సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. గత కొంతకాలం నుంచి అటు రుతురాజ్ రంజీ ట్రోఫీలో ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే అద్భుతమైన పరదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవల అతని మణికట్టుకు గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో అతను జట్టుకు దూరం కాబోతున్నాడు. ఋతురాజ్ స్థానంలో జట్టులోకి ఎవరు రాబోతున్నారు అన్నది హాఫ్ టాపిక్ గా మారింది.