టీమిండియాలో రవీంద్ర జడేజా ఎంత కీలక ఆటగాడిగా  కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్రౌండర్ అంటే రవీంద్ర జడేజా లాగే ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకునేలా తన ఆటతీరుతో ప్రభావితం చేశాడు అని చెప్పాలి. స్పిన్ బౌలింగ్ తో మాయ చేస్తూ వికెట్లు పడగొట్టడమే కాదు ఇక జట్టుకు అవసరమైనప్పుడల్లా కూడా తన బ్యాడ్ తో మెరుపులు మెరూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. జట్టులో ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లకు దీటుగా తన బ్యాటింగ్లో విధ్వంసాన్ని సృష్టిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. ఇక మైదానంలో ఎవరికి సాధ్యం కాని రీతిలో మెరుపు వేగంతో కదులుతూ తన ఫీల్డింగ్ తో ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇక టీమిండియాలో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న రవీంద్ర జడేజా ఆట తీరు చూసిన తర్వాత ఇలాంటి ఆల్రౌండర్ మా జట్టులో ఉంటే ఎంత బాగుండో అని ప్రతి జట్టు అసూయపడేలా అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే సరిగ్గా వరల్డ్ కప్ ప్రారమానికి ముందు మోకాలి కాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చివరికి సర్జరీ కావడంతో ఇక కొన్ని నెలల నుంచి టీమిండియాలో కనిపించడం లేదు. అయితే ఇటీవల గాయం నుంచి కోలుకున్నాడు జడేజా. ఇక ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు అతన్ని రంజీ మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ సూచించింది.


 అయితే ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అతను జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఇక అంతకుముందు ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ప్రస్తుతం రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ఆడుతున్నాడు రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఇక ఇటీవల ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న తర్వాత ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో తమిళనాడు జట్టు 133 పరుగులకే ఆల్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఒక వికెట్ పడగొట్టి మొత్తంగా ఒక మ్యాచ్ లో 8 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: