సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది  ప్రతి మ్యాచ్లో పదిమంది బ్యాట్స్ మెన్లు ఎలా అయితే బ్యాటింగ్ చేస్తూ ఉంటారో.. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఐదు లేదా 6 మంది బౌలర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి వీలు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా జట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్నవారు కేవలం తమ జట్టులో ఉన్న బౌలర్లను కొంతమందిని మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.


 కానీ ఇక్కడ మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. ఏకంగా క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. ఒక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ప్లేయర్ ఊహించిన రీతిలో ఎక్కువమంది బౌలర్లను వినియోగించింది. ఇంతకీ ఎంతమంది అనుకుంటున్నారో తెలుసా.  ఏకంగా తొమ్మిది మంది బౌలర్లని సదరు కెప్టెన్ ఏకంగా ప్రత్యార్థులను దెబ్బ కొట్టేందుకు వినియోగించింది అని చెప్పాలి. అయితే ఇది జరిగింది పురుషుల క్రికెట్లో కాదు మహిళల క్రికెట్లో కావడం కామ కమనార్హం.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్తాన్ జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఆసీస్ కెప్టెన్ మేగ్ లానింగ్ ఏకంగా తొమ్మిది మందితో బౌలింగ్ చేయించింది అని చెప్పాలి. కెప్టెన్ మెగ్ లానింగ్ మినహా జట్టులో ఉన్న సభ్యులు అందరూ కూడా బౌలింగ్ చేయడం గమనార్హం. అయితే ఇలా అంతర్జాతీయ టి20లలో ఇలా ఒకే ఇన్నింగ్స్ లో 9 మంది బౌలింగ్ చేయడం ఇది ఏడవ సారి కావడం కావడం  గమనార్హం. దీంతో ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: