
అందుకే మహేంద్రసింగ్ ధోని పేరు వినిపించింది అంటే చాలు అటు అభిమానులందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2019లో మహేంద్ర సింగ్ ధోని ఎవరు ఊహించని విధంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు అని చెప్పాలి. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా అతని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ధోని సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినప్పటికీ తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగా ఉన్నాను అన్న విషయాన్ని సంకేతాన్ని ఇస్తూ ఉంటాడు అని చెప్పాలి.
7
ఇకపోతే ఇటీవలే మహేంద్రసింగ్ ధోనీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే న్యూజిలాండ్తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా టి20 సిరీస్ మొదటి మ్యాచ్ ప్రారంభానికి ముందు మహేంద్ర సింగ్ ధోని ఎవరు ఊహించని విధంగా డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. దీంతో యువ ఆటగాళ్లు అందరూ కూడా సర్ ప్రైస్ అయ్యారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడి ఎన్నో విలువైన సలహాలు సేకరించారు యువ ఆటగాళ్ళు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.