
గత కొంతకాలం నుంచి ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తున్న అటు దేశవాళి క్రికెట్లో భారీగా పరుగులు చేస్తూ ఉన్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం జట్టు ఎంపిక సమయంలో అతని పరిగణలోకి తీసుకోవడం లేదు. అయితే ఇక జట్టులో చోటు దక్కుతుందేమో అని ఎదురు చూడటం.. ఇక లిస్టులో తన పేరు లేకపోవడంతో నిరాశ చెంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గత కొంతకాలం నుంచి పృద్విషా విషయంలో జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే అతని అభిమానులకు కూడా నిరాశలో మునిగిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల పృద్విషాకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ.
దాదాపు 18 నెలల తర్వాత టీమిండియాలోకి వచ్చేందుకు బీసీసీఐ నుంచి పృద్విషాకు పిలుపు అందింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తానని తాను అనుకోలేదు అంటూ పృథ్వి షా చెప్పుకొచ్చాడు. ఈ 18 నెలల కాలంలో ఎన్నో హెచ్చుతగ్గులు చూశాను అంటూ తెలిపాడు. అయితే ఇక పృద్విషాకు మళ్ళీ పిలుపు రావడంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్ లో పృథ్వి షా ఆడకపోయినప్పటికీ అటు వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్ లో మాత్రం తుది జట్టులో కనిపించే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.