
అయితే ఇక ఇప్పుడు రెండవసారి కూడా పృథ్వి షాకు బ్రేకప్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పృథ్వి షాకు రెండవ గర్ల్ ఫ్రెండ్ నిధి తపాడియా ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక కథనాన్ని పంచుకుంది. ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని ప్రచారంకి ఇక ఆ కథనం మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవల ఆమె పెట్టిన పోస్టులో పంజాబీ బ్రేకప్ సాంగ్ ను నేపద్యపాటగా వాడుకుంది. అంతే కాదు ఇంస్టాగ్రామ్ లో నిధి, పృథ్వి షా ఒకరిని ఒకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారు.
ఇక గత కొంతకాలం నుంచి నిధి పృథ్వి షా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి న్యూయార్క్ కూడా జరుపుకున్నారు. ఇక పృథ్వి షా రంజిల్లో 300 పరుగులు చేసిన సమయంలో కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీ లో వీడియోను షేర్ చేసింది. కానీ ఇప్పుడు వీరికి బ్రేకప్ అయినట్లు తెలుస్తుంది. కారణం ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు. ఇకపోతే అంతకుముందు పృథ్వి షా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ తో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని పార్టీలు పబ్బులు అంటూ తిరిగేవారు. ఇక ప్రాచీ సింగ్ కి పృథ్వి తో బ్రేకప్ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు వచ్చిన కొన్ని రోజులకే ఇద్దరు కూడా ఒక్కరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు.