గత ఏడాది టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అటు టీమ్ ఇండియా ఎంత అద్భుతమైన ఫాం కనబరిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత కూడా వరుసగా మ్యాచ్ లలో ఇదే రీతిలో దూసుకుపోయింది. కానీ కీలకమైన సెమీఫైనల్ లో మాత్రం ఓడిపోయి ఇంటి బాట పట్టింది. ఇక నాకౌట్ ఫోబియాకు చిత్తు అయ్యి చివరికి వరల్డ్ కప్ ఆశలను గల్లంతయ్యేలా చేసింది అని చెప్పాలి. అయితే ఇక మరికొన్ని రోజుల్లో మహిళల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత మహిళల జట్టు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


 సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే మహిళల టి20 ప్రపంచ కప్ కి ముందు అటు భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడింది. గ్రూప్ దశలో ఒక్కసారి కూడా ఓడకుండా ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు.. తుది పోరులో మాత్రం రానించకుండా చేతులెత్తేసింది. దీంతో రన్నర్ ఆఫ్ గా నిలిచింది. ఇప్పుడే కాదు గత కొన్నేళ్ల నుంచి భారత మహిళల జట్టును కూడా నాకౌట్ ఫోబియా వెంటాడుతోంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం కొన్ని కొత్త పాఠాలను నేర్చుకున్నామని భారత క్రికెటర్లు చెప్పుకొచ్చారు. ఇక అవి సరిదిద్దుకొని టి20 వరల్డ్ కప్ లో అదరగొడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.


 ఒకవేళ టీ20 వరల్డ్ కప్ లో కూడా భారత మహిళలు జట్టు నాకౌట్ ఫోబియాను అధిగమించలేదంటే కప్పు గెలవాలని ఆశలు గల్లంతయినట్లే. ఈ క్రమంలోనే  టోర్నీ ప్రారంభానికి ముందు అదరగొడతామని చెప్పి అభిమానుల్లో ఆశలు రేకెత్తించడం... ఇక ఆ తర్వాత టోర్నీ ప్రారంభమయ్యాక చేతులెత్తేయడం అటు పురుషుల జట్టుకు ఇటు మహిళల జట్టుకు అలవాటైన పని అంటూ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిరాశతో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఫిబ్రవరి 10 నుంచి మహిళల టీ20 ప్రపంచ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 12వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: