
సాధారణంగానే భారత జట్టును ఇక సొంత గడ్డపై ఓడించడం అసాధ్యం అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే విధంగా భారత మైదానాలలో స్పిన్ కు అనుకూలంగా ఉండే పిచ్ లు ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక భారత స్పిన్నర్ లను ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఎలా ఎదుర్కొంటారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే దీనికోసం ఆస్ట్రేలియా ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా డేంజరస్ అశ్విన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతని తరహాలో బౌలింగ్ చేసే భారత యువ ఆటగాడు మహేష్ పితియాతో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.
ఇక ఇటీవల ఇదే విషయంపై వసీం జాఫర్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మరికొన్ని రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందుగానే రవిచంద్రన్ అశ్విన్ ఆసిస్ ఆటగాళ్ల తలలోకి దూరిపోయాడంటూ జాఫర్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా మహేష్ పితియాతో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేయగా.. ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ వసీం జాఫర్ ఈ వ్యాఖ్యలు చేస్తాడు అని చెప్పాలి.