
ఇక ఇప్పుడు లియోనల్ మెస్సి మరిన్ని లీగ్ లలో కూడా ఆడుతూ ఆయా జట్ల విజయం కోసం పోరాడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వరకు లీయోనల్ మెస్సి తన ఆట తీరుతో ప్రత్యర్ధులను బోల్తా కొట్టించడం ఎన్నోసార్లు చూశాము. కానీ ఇటీవలే మెస్సినే ఒక యువకుడు బోల్తా కొట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మెస్సి పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే పిఎస్జి ప్లేయర్స్ కోసం ఇటీవలే పారిస్లో ఒక పార్టీ నిర్వహించగా ఈ పార్టీకి మెస్సి సహా మిగతా ప్లేయర్స్ అందరూ కూడా వచ్చారు. అయితే పార్టీకి జూలీస్ డియిన్ అనే మజీషియన్ కూడా వచ్చాడు. మెస్సి దగ్గరికి వచ్చి ఒక కార్డు ట్రిక్ ప్లే చేశాడు.
ఈ క్రమంలోనే మెస్సిని ఒక కార్డు సెలెక్ట్ చేసుకోవాలని సూచించాడు. ఇక మెసేజ్ సెలెక్ట్ చేసుకున్న కార్డు తనకు చూపించ వద్దు అంటూ సూచించాడు. అయితే మెస్సి ఏ అనే కార్డును సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన మ్యాజిక్ ట్రిక్ తో మెస్సి ఎంచుకున్న కార్డును మెజీషియన్ కరెక్ట్ గా చూపించడంతోపాటు అర్థం కాని భాషలో మాట్లాడాడు. ఆ సమయంలో మెస్సి భార్య ఆంటోనెల్లా కూడా అక్కడే ఉంది.. అయితే ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో తెలియక మెజీషియన్ పడుతున్న కష్టాన్ని చూసి మెస్సి నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత మెసేజ్ చేతిలో దాచిపెట్టిన కార్డును తన మ్యాజిక్ తో నెంబర్ మార్చేసాడు. దీంతో మెస్సి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.