ఎన్నో రోజుల నుంచి ఆదరణకు నోచుకోని మహిళా క్రికెటర్లకు ఇక ఇప్పుడు స్వర్ణ యుగం ప్రారంభమైందా అంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు చెబుతున్న మాట అవును అనే. ఎందుకంటే ఇప్పటికే బీసీసీఐ మహిళల క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా సంచలనం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పుడు అంతంత మాత్రం వేతనాలు అందుకున్న మహిళ క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగానే వేతనాలు చెల్లించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది.


 ప్రపంచ క్రికెట్లో ఏ క్రికెట్ బోర్డు కూడా ఇప్పటివరకు ఇలా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు చెల్లించడం లేదు  బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా అటు మహిళా క్రికెటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే మహిళల కోసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది అని చెప్పాలి. ఇక నిర్ణయంతో అటు మహిళా క్రికెట్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది బీసీసీఐ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన మెగా వేలం ప్రక్రియ కూడా జరిగింది.


 అచ్చం పురుష క్రికెటర్ల లాగానే అటు మహిళా క్రికెటర్లు కూడా మెగా వేలంలో కోట్ల రూపాయల ధర పలికారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీం ఇండియా కెప్టెన్ హార్మన్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళా క్రికెట్లో సరికొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అభిప్రాయపడింది. ప్రతి ఒక్క మహిళా క్రికెటర్ ఈ అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక ముంబై పురుషుల జట్టు ఐపీఎల్లో రాణించినట్లుగానే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల జట్టు తప్పక రాణిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా ఇటీవల హర్మన్ ప్రీత్ ను  ముంబై ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే హలో బ్లూ ఫ్యామిలీ అంటూ ఒక పోస్ట్ పెట్టింది హర్మన్ ప్రీత్ కౌర్.

మరింత సమాచారం తెలుసుకోండి: