ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా జట్టు ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్లు ఎంతో విజయవంతంగా ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. నాగ్ పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. ఇక ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశం ఎక్కడ ఇవ్వలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకొని టీమ్ ఇండియా ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఢిల్లీ వేదికగా ఈ నెల 17వ తేదీన రెండవ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఢిల్లీ మైదానం అటు టీమ్ ఇండియాకు అచ్చొచ్చిన మైదానం కావడంతో రెండవ టెస్ట్ మ్యాచ్ లో కూడా టీమిండియాదే విజయం అని ఇప్పటికే ఎంతోమంది క్రికెట్ పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఇక రెండవ టెస్టు మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వెన్నునొప్పి గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్న శ్రేయస్ అయ్యర్ ఇటీవలే పూర్తిస్థాయి ఫిట్నెస్  సాధించినట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే అతను ఢిల్లీ వేదికగా జరగబోయే రెండవ టెస్ట్ మ్యాచ్లో జట్టులోకి రాబోతున్నాడు.


 స్పిన్ ను బాగా ఆడగలడు అని పేరున్న శ్రేయస్ అయ్యర్ కు అటు సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో కూడా మంచి రికార్డులు ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఉపఖండపు పిచ్ లపై ఉండే టర్నింగ్ ను బాగా ఆడగల సామర్థ్యం శ్రేయస్ అయ్యర్ సొంతం అని చెప్పాలి. దీంతో ఇక రెండో టెస్టు మ్యాచ్లో ఎలాంటి అనుమానాలు లేకుండా అతను తుది జట్టులో ప్రత్యక్షం కావడం ఖాయం అన్నది తెలుస్తుంది. అయితే అతను జట్టులోకి వస్తే ఎవరిపై వేటు వేస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే టెస్ట్ ఫార్మాట్ కి కొత్త అయినా సూర్య కుమార్ యాదవ్ నే ఇక సెలక్టర్లు పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. అయితే గిల్ కు ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో అనుభవం ఉండడం.. ఇక మంచి ఫామ్ లో ఉండడంతో అతని తుది జట్టులో కొనసాగించే చాన్స్ ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: