
గత కొన్నేళ్ల నుంచి కూడా కరోనా వైరస్ ప్రభావం దృశ్య బీసీసీఐ కేవలం కొన్ని వేదికలలో మాత్రమే ఐపిఎల్ నిర్వహిస్తూ ఉంది. దీంతో హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ చూడాలని ఆశపడిన ఎంతో మంది అభిమానులకు నిరాశ ఎదురయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం ఇక 2023 ఐపీఎల్ సీజన్ అన్ని జట్లకు సంబంధించిన హోమ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే అందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అందింది అని చెప్పాలి. కాగా అటు హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులు అయితే బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ తో పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కేవలం హైదరాబాద్లోనే ఏడు మ్యాచ్లు జరగబోతున్నాయి.
ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ఇక హైదరాబాద్లో కూడా మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇక మూడేళ్ల తర్వాత హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులు ఇక సన్రైజర్స్ జట్టు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడితే చూడబోతున్నారు. ఏప్రిల్ 2, 9, 18, 24 తేదీలలో మొత్తంగా నాలుగు మ్యాచ్లు జరగనుండగా... ఇక మే నెలలో 4, 13, 18 తేదీలలో కూడా సన్రైజర్స్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ లు ఆడబోతుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా మిగతా అన్ని జట్లకు సంబంధించిన మ్యాచులు హైదరాబాద్ లో చూడవచ్చు. ఇక ఈ విషయం తెలిసి నిజంగా ఇది హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులకు పండగ లాంటి వార్త అని ఎంతోమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.