వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం భారత జట్టు ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా తో ఎంతో దీటుగా పోరాడుతూ ఉంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు ఎక్కడగా అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన ప్రదర్శన చేసి వరుస విజయాలు సాధించే వైపుగా దూసుకుపోతుంది. ఇప్పటికే నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ అటు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతూ ఉంది. ఇకపోతే ఇటీవల శుక్రవారం వేదికగా ప్రారంభమైన రెండవ టెస్టు తొలి సెషన్లో టీం ఇండియానే పై చేయి సాధించింది అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే టీమిండియా రెండో మ్యాచ్లో కూడా గెలిచేలాగే కనిపిస్తుంది. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఎప్పటిలాగానే మళ్లీ అశ్విన్ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను భయపెట్టేసాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకొని కోలుకోలేని దెబ్బతీసాడు అని చెప్పాలి.



 అయితే ఒక్క వికెట్ కోల్పోకుండా 50 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించిన ఆస్ట్రేలియా ఓపెనింగ్ జోడిని టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమీ విడదీశాడు అని చెప్పాలి. అద్భుతమైన బంతిని అంచనా వేయడంలో విఫలమైన డేవిడ్ వార్నర్  కీపర్ కేఎస్ భరత్ కు క్యాచ్ ఇచ్చి చివరికి వికెట్ సమర్పించుకున్నాడు. అప్పటి వరకు 44 బంతులు ఆడిన డేవిడ్ వార్నర్ కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు అని చెప్పాలి. అయితే తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోను డేవిడ్ వార్నర్ షమీ బౌలింగ్ లోనే అవుట్ కావడం గమనార్హం.


 అయితే ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు సంపాదించుకున్న తెలుగు క్రికెటర్ కెఎస్ భరత్ ఎలా రానిస్తాడు అనే దానిపైనే అందరి దృష్టి ఉండగా.. తన కీపింగ్ నైపుణ్యాలతో అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు భరత్. ఇక ఇటీవల జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా అశ్విన్ వేసిన బంతికి స్మిత్ వికెట్ దక్కింది. ఇందులో వికెట్ కీపర్ కేఎస్ భరత్ పాత్ర ఎక్కువగా ఉంది. చాలా లోగా వచ్చిన  బంతిని ఎంతో పర్ఫెక్ట్ గా అంచనా వేసిన భరత్ అద్భుతమైన క్యాచ్ ని అందుకున్నాడు. తద్వారా ఇక టీమ్ ఇండియాకు ఎంతో ముఖ్యమైన వికెట్ అందించాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో కేఎస్ భరత్ను క్రికెట్ అభిమానులు మరో ధోని అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: