ఇటీవల కాలంలో భారత మహిళల జట్టు ప్రపంచ క్రికెట్లో ఎంతల హవా నడిపిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మేటి జట్లలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా మహిళల జట్టు అటు పురుషుల క్రికెట్కు ఎక్కడా తక్కువ కాదు అనే రీతిలోనే ప్రతి మ్యాచ్లో కూడా ప్రదర్శనలు చేస్తూ వుంది. అదే సమయంలో ఇక ఎంతోమంది పురుష క్రికెటర్లు సృష్టించిన రికార్డులను సైతం ఇటీవల కాలంలో తమ అద్భుతమైన ప్రదర్శన ద్వారా మహిళా క్రికెటర్లు కూడా రికార్డులు బద్దలు కొడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఈ క్రమంలోనే ఇక మహిళా క్రికెట్కు ఆదరణ పెంచడమే లక్ష్యంగా తమ ఆట తీరుతో రికార్డులు కొల్లగొట్టి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తమ వైపుకు తిప్పుకుంటున్నారు ఎంతోమంది భారత మహిళా క్రికెటర్లు. ఇక ఇలా మహిళా క్రికెటర్లు వరుసగా ఎన్నో వరల్డ్ రికార్డులు కొల్లగొడుతూ ఉండటం మాత్రం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే టీమిండియా మహిళల జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న హార్మన్ ప్రీత్ ఒక అరుదైన రికార్డును సృష్టించింది. టీమిండియా పురుష జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అని చెప్పాలి.



 ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా ఇక టీమిండియా ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక ఈ మ్యాచ్ లో భాగంగా భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఒక అరుదైన మైలు రాయిని చేరుకుంది. టీ20 ఫార్మాట్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా తొలి స్థానంలో నిలిచింది. అంతకుముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్  148 మ్యాచ్లతో ఎక్కువ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా ఉండగా.. ఇప్పుడు 149 మ్యాచ్ లతో హార్మన్ తొలి స్థానంకి చేరుకుంది. మహిళా క్రికెటర్లలో న్యూజిలాండ్ ప్లేయర్ సుజి బెడ్స్ 142 మ్యాచ్లతో అందరికంటే టాప్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: