
టీమిండియా బ్యాటింగ్ విభాగాన్ని బోల్తా కొట్టించి వరుసగా వికెట్లను దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా తక్కువ పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం ఖాయం అని అనుకుంటున్నా సమయంలో ఎలాంటి అంచనాల లేకుండానే బ్యాటింగ్ చేస్తున్నా అశ్విన్ అక్షర్ పటేళ్ లు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టీమ్ ఇండియాని కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. ఈ ఇద్దరు ఎనిమిదవ వికెట్ కు 114 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. 139 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో టీమిండియా ఉన్న సమయంలో ఇద్దరు జట్టును ఆదుకున్నారు అని చెప్పాలి.
అయితే ఇక అశ్విన్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ ప్రదర్శన పై ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ లియోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నా.. అశ్విన్, అక్షర్ లు ఏమాత్రం లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కాదు. అది క్లియర్. ఎందుకంటే జట్టులో టాప్ సిక్స్ బ్యాట్స్మెన్ లతో సమానంగానే పోటీపడి ఆడగల సామర్థ్యం వాళ్లకి ఉంది. వాళ్లు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. భారత్కు లోతైన టాప్ ఆర్డర్ ఉంది. వీరి ఆట చూసిన తర్వాత ఇక వారిని ఎవరు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అని అనరు అంటూ నాథన్ లియోన్ చెప్పుకొచ్చాడు. కాగా మొదటి ఇన్నింగ్స్ లో అక్షర్ పటేల్ 74 పరుగులు చేయగా అశ్విన్ 37 పరుగులతో రాణించాడు.