ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా తక్కువ సమయంలోనే ఫేవరెట్ లీగ్ గా మారిపోయింది బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రతి ఏడాది కూడా అటు క్రికెట్ అభిమానులందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పటివరకు ఎంతో విజయవంతంగా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 15 ఏళ్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చేందుకు ఒక దారి చూపింది. అంతేకాదు ఇంకా ఎంతో మందికి ఫైనాన్షియల్ గా నిలదోక్కుకునేందుకు అండగా నిలిచింది. అంతేకాదు కొంతమంది సాదాసీదా ఆటగాళ్లను స్టార్ ప్లేయర్లుగా మార్చింది అని చెప్పాలి.



 అంతేకాదు ఇక ఎంతోమంది యువ ఆటగాళ్లలో దాగివున్న నాయకత్వ ప్రతిభను కూడా బయటపెట్టి ఇక ఎన్నో జట్లకు ఫ్యూచర్ కెప్టెన్లను అందించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. కేవలం విదేశీ జట్లకు మాత్రమే కాదు.. భారత జట్టుకు సైతం ఒక అద్భుతమైన కెప్టెన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయిన రోహిత్ శర్మ తన నాయకత్వ ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. దీంతో ఇక ఇప్పుడు కోహ్లీ తర్వాత అతని చేతికే కెప్టెన్సీ పగ్గాలు వచ్చాయి అని చెప్పాలి. ఇక తనదైన కెప్టెన్సీ తో ప్రస్తుతం టీమిండియాని కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.


 అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యి 15 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో సూపర్ సక్సెస్ కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కి ఉత్తమ కెప్టెన్ అవార్డును కట్టబెట్టింది. స్టార్ స్పోర్ట్స్ ఇక బెస్ట్ బ్యాటర్ అవార్డును ఎబి డివిలియర్స్ కు ఇచ్చింది. బెస్ట్ బౌలర్ గా బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ రస్సెల్, అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా కోహ్లీ, అత్యుత్తమ బౌలర్గా నరైన్ కు అవార్డులు ఇచ్చింది స్టార్ స్పోర్ట్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl