
గత ఏడాది ధమాకా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పటికే హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇక వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. 1970లో పోలీస్ లనే ముప్పు తిప్పులు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 70 శాతానికి పైగా పూర్తయింది అన్నది తెలుస్తుంది..
ఈ క్రమంలోనే రవితేజ అభిమానులందరికీ పండగ లాంటి న్యూస్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. తెలుగు,తమిళం మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు మూవీని ఇక ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. దీన్ని బట్టి చూస్తే ఇక రవితేజ సూపర్ స్టార్ మహేష్ బాబును ఢీకొట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కూడా అదే రోజు విడుదల కాబోతుంది. దీంతో ఇక ఇప్పుడు రవితేజ మహేష్ బాబు మధ్య బాక్సాఫీస్ వద్ద ఫైట్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. మరి ఈ ఫైట్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి మరి.