గత రెండు వారాలుగా దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టీ 20 వరల్డ్ కప్ 2023 నిర్విరామంగా సాగిపోతోంది. లీగ్ స్టేజ్ ను దాటుకుని ఇప్పుడు నాక్ అవుట్ స్టేజ్ కు చేరుకున్నాము. క్రికెట్ విశ్లేషకులు ఊహించిన విధంగానే సెమీస్ కు ఆస్ట్రేలియా , ఇండియా , ఇంగ్లాండ్ మరియు ఆతిధ్య సౌత్ ఆఫ్రికాలు చేరుకున్నాయి. నిన్న కేప్ టౌన్ వేదికగా ఇండియా మరియు ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్యన మొదటి సెమీఫైనల్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు జట్లు ఫేవరెట్ లుగానే రేస్ ను స్టార్ట్ చేసినా చివరికి ఆస్ట్రేలియా మహిళల జట్టునే విజయం వరించింది. తద్వారా ఆస్ట్రేలియా టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు చేరుకుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆసీస్ ఓపెనర్లు ఆ తర్వాత చెలరేగి ఆడారు. అలా ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో బెత్ మూనీ 54 పరుగులు, కెప్టెన్ లానింగ్ 49 పరుగులు, గార్డనర్ 31 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియాకు ఉన్న బ్యాటింగ్ డెప్త్ కు ఆ మాత్రం స్కోర్ కు ఇండియా బౌలర్లు నిలువరించారంటే గొప్ప విషయమనే చెప్పాలి. కానీ రెండవ ఇన్నింగ్స్ లో బౌలర్లకు పిచ్ నుండి మంచి సహకార అందిందని చెప్పాలి.

 ఛేజింగ్ లో కీలక ప్లేయర్స్ షెఫాలీ వర్మ మరియు మందన్న లు తక్కువ స్కోర్ కే అవుట్ అవడంతో చిక్కుల్లో పడనిది ఇండియా. కానీ ఆ తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరియు జెమీమా రోడ్రిగస్ లు నిలకడగా ఆడుతూ జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చారు. ఆఖరి అయిదు ఓవర్ లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆసీస్ ఇండియాను విజయానికి దూరం చేసింది. అలా ఇండియా మరోసారి వరల్డ్ కప్ టైటిల్ కల కలగానే మిగిలిపోయింది. వాస్తవంగా ఇండియా గెలుపుకు దగ్గరగా వచ్చింది.. కీలక సమయంలో కౌర్ రన్ అవుట్ అవ్వడం , రోడ్రిగస్ సైతం అనవసర షాట్ కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో ఆశలు అడియాసలు అయ్యాయి. దీనితో ఆస్ట్రేలియా 7 వసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది.  






   

మరింత సమాచారం తెలుసుకోండి: