సౌత్ ఆఫ్రికా వేదికంగా జరిగిన టి20 మహిళల వరల్డ్ కప్ లో భాగంగా అటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు సెమి ఫైనల్లో ఓడిపోయి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. అప్పటి వరకు లీగ్ దశ మ్యాచ్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా జట్టు ఎంతో అలవోకగా కప్పు కొట్టడం ఖాయమని అందరూ భావించారు. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మాత్రం ఇక లీగ్ దశలో చేసినట్లుగా మంచి ప్రదర్శన చేయలేకపోయింది. పేలవమైన బ్యాటింగ్ బౌలింగ్ తో   ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది అని చెప్పాలి.



 జట్టులో ఉన్న కీలకమైన బ్యాటర్లు అందరూ కూడా చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రత్యర్థి ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని చేదించడంలో విఫలం అయ్యింది. అయితే భారత జట్టు  సెమీఫైనల్ లో ఓటమి నేపథ్యంలో నిరాశలో మునిగిపోయిన అభిమానులు టీమిండియా పై విమర్శలు చేస్తూ ఉన్నారు. టీమిండియా కు ఇలా కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తేసి ఇంటి బాట పట్టడం ఆనవాయితీగా వస్తుంది అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ సెమి ఫైనల్లో ఓడిపోవడంపై టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ మరోసారి స్పందించింది.



 ఈ టి20 వరల్డ్ కప్ లో మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ తెలిపింది హర్మన్ ప్రీత్ కౌర్.  అయితే సెమీఫైనల్ లో ఓటమి అందరికీ బాధ కలిగించింది అన్న విషయం మాకు తెలుసు. అయితే మేం బలంగా తిరిగి వచ్చి మంచి ప్రదర్శన ఇవ్వగలము అంటూ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. కాగా సెమి ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడిన టీమ్ ఇండియా జట్టు చివరి వరకు గెలిచేందుకు పోరాడినప్పటికీ ఇక ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: