
ప్రస్తుతం ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 3 ఇన్నింగ్స్ ఆడాడు. దీనిలో అతను 12.66 సగటు తో కేవలం 38 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఆశ్చర్యకరం గా జట్టులో 10వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ 2 ఇన్నింగ్స్‌లలో 39 పరుగులు చేశాడు. 21.8 సగటు నమోదు చేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ పేలవమైన ఫామ్ వల్ల కేఎల్ రాహుల్ మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే భారత్ ఈ సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక గత ఏడాది కాలంలో భారత క్రికెటర్ల యావరేజి చూస్తే రవీంద్ర జడేజా 70.7 సగటుతో ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానంలో 67 సగటుతో రిషబ్ పంత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో 48.7 సగటుతో శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో, 48.2 సగటుతో ఛతేశ్వర్ పూజారా తర్వాతి స్థానంలో ఉన్నారు. అశ్విన్ 37 సగటు, అక్షర్ పటేల్ 32.6 సగటును సాధించారు. వీరందరి వెనుకనే విరాట్ కోహ్లి 21.2 సగటుతో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది.