భారత మహిళల జట్టులో కీలకమైన ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉంది దీప్తి శర్మ . అయితే ఈ క్రికెటర్ గురించి అటు క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి.  ఇప్పటికే తన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.  ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. అంతేకాదు గతంలో మన్కడింగ్ అనే వివాదం లో కూడా చిక్కుకొని ప్రపంచ క్రికెట్లో ఎన్నో రోజులపాటు హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా భారత జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న దీప్తి శర్మకు ఇటీవల ప్రమోషన్ లభించింది.



 ఈ ఏడాది నుంచి మహిళల క్రికెట్ ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు అటు బీసీసీఐ సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇందుకు సంబంధించిన వేలం కూడా జరిగింది. ఈ వేలంలో ఇక ఎంతోమంది ప్లేయర్లు కోట్ల రూపాయలు ధర పలికారు అని చెప్పాలి.  అయితేఈ ఏడాది జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పాలి. యూపీ వారియర్స్ జట్టు దీప్తి శర్మను కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు స్టార్ ప్లేయర్ గా ఉన్న దీప్తి శర్మకు ఏకంగా యూపీ వారియర్స్ తమ జట్టుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.



 యూపీ వారియర్స్ జట్టు ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా తమ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అయిన అలీసా హీలి కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతుంది అన్న విషయాన్ని ఇప్పటికే ప్రకటించింది. ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్గా దీప్తి శర్మను నియమిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ కు చెందిన దీప్తి శర్మ ఇప్పటివరకు భారత జట్టు తరపున 92 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడింది 941 పరుగులు చేయడంతో పాటు 102 వికెట్లు పడగొట్టింది అని చెప్పాలి. 25 ఏళ్ల దీప్తి శర్మ ప్రస్తుతం icc టి20 ర్యాంకింగ్స్ లో బౌలింగ్ ఆల్రౌండర్ విభాగాల్లో నాలుగో స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: