ఒకప్పటితో పోల్చి చూస్తే ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా క్రికెట్ ప్రమాణాలు మరింత మెరుగయ్యాయి అన్నదానికి నిదర్శనంగా ఎప్పుడు ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అనుకున్న జట్లు ఫీల్డింగ్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమ ఫీల్డింగ్  ప్రమాణాలను అత్యున్నతంగా మార్చుకొని ఇక ప్రత్యర్ధులకు వణుకు  పట్టిస్తూ ఉన్నాయి.  ఇక ఇటీవల కాలంలో ఎంతోమంది ప్లేయర్లు మైదానంలో ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో ఏకంగా చిరుత పులిలా కదులుతూ పరుగులను కట్టడి చేయడమే కాదు స్టన్నింగ్ క్యాచ్ లు పడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు.


 ఇలా ఇటీవల కాలంలో ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఇలాంటి అద్భుతమైన క్యాచ్ లు ఎన్నో మ్యాచ్ లలో చూస్తూనే ఉన్నాము అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటిదే ఏదైనా జరిగిందంటే చాలు ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు హోలీ పోప్ సంచలన క్యాచ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. అసాధారణమైన రీతిలో అద్భుతమైన డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.


 ఈ క్రమంలోనే తన అద్భుతమైన క్యాచ్ తో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ హెన్రీ నికోల్స్ పెవిలియన్  పంపడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 25 ఓవర్ సమయంలో జాక్లీచ్ బౌలింగ్ వేసాడు. నీకోల్స్ రివర్స్ స్వీట్ ఆడెందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అనుక్యంగా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని అతడి హెల్మెట్ కు తగిలింది. తర్వాత సిల్లీ పాయింట్ దిశగా వెళ్ళింది   అయితే అక్కడ ఫీల్డింగ్  చేస్తున్న పోప్ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే వెనక్కి డైవ్ చేస్తూ ఈ క్యాచ్ అందుకోవడం గమనార్హం. దీంతో అప్పటివరకు 30 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన నికోల్స్  నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: