భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇకపోతే ఇక గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలం కారణంగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న కొన్ని టీంలు.. కొత్తగా టీంలోకి వచ్చిన వారికి ఏకంగా సారధ్య బాధ్యతలు కూడా అప్పగించాయ్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఢిల్లీ జట్టు కూడా ప్రస్తుతం కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఎందుకంటే ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతూ ఇక సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించిన రిషబ్ పంత్ గత ఏడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక సర్జరీలు కూడా జరుగుతున్నాయి. దీంతో అతను దాదాపు సంవత్సరం పాటు క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇక ఢిల్లీ జట్టుకు కొత్త కెప్టెన్ను నియమించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రస్తుతం జట్టులో సీనియర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కి ఇప్పటికే కెప్టెన్సీ అప్పగించెందుకు అన్ని ఏర్పాట్లు చేసిందట జెట్టి యాజమాన్యం .



 అయితే ఢిల్లీ జట్టు ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను యువ ఆల్రౌండర్ అయిన అక్షర్ పటేల్ కు అప్పజెప్పేందుకు సిద్ధమైందట. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. దేశ వారి క్రికెట్లో ముంబై రంజి జట్టుకు కెప్టెన్ గా ఉంటూ సక్సెస్ అయిన పృద్విషాను కాదని అక్షర పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం అక్షర్ పటేల్ సూపర్ ఫామ్ లో ఉండడం కారణంగానే ఢిల్లీ యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలా పృద్విషాను కాదని అక్షర పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం మాత్రం పృథ్విషా అభిమానులకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: