టి20 క్రికెట్ అంటేనే ఎన్నో ప్రపంచ రికార్డులకు కేరాఫ్ అడ్రస్  అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక అటు టి20 ఫార్మాట్ ను బ్యాట్స్మెన్ ల క్రికెట్ గా చెప్పుకుంటూ ఉంటారు. కారణం క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా రావడం రావడమే సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. క్రీజులో కుదురుకోవడానికి కావలసిన ఎక్కువ మొత్తంలో బంతులు ఉండవు. కాబట్టి ఇక తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే లక్ష్యంగా ప్రతి బ్యాట్స్మెన్ కూడా వీర విహారం చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్లో ఎలాంటి బ్రేక్ లేకుండా సిక్సర్లు ఫోర్ ల విధ్వంసాన్ని చూడవచ్చు. అందుకే అటు అభిమానులు సైతం టి20 ఫార్మాట్ ని ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా తమ బ్యాటింగ్ విధ్వంసంతో ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన జట్లు కొన్ని అయితే ఇక కనీస పోటీ ఇవ్వలేక పేలవ ప్రదర్శనతో చెత్త రికార్డులు ఖాతాలో వేసుకున్న జట్లు కూడా కొన్నీ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వరకు మనం మాట్లాడుకోబోయేది మాత్రం ఏ క్రికెట్ మ్యాచ్ లో జరగలేదు అని చెప్పాలి. ఏకంగా టి20 ఫార్మాట్ మ్యాచ్ లో పది పరుగులకే ఒక జట్టు ఆల్ అవుట్ అయింది.



 పది పరుగులకే ఆల్ అవుట్ అవ్వడమేంటి.. ఇలాంటిది గల్లీ క్రికెట్లో కూడా జరగదు కదా అనుకుంటారు ప్రేక్షకులు ఎవరైనా ఈ విషయం తెలిసి. స్పెయిన్ -ఐల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఐల్ ఆఫ్ మాన్ జట్టు పది పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ పది పరుగులు చేయడానికి ఆ జట్టు 8.4 తీసుకోవడం గమనార్హం. ఇందులో ఆరు డక్ అవుట్ లు కూడా నమోదు అయ్యాయి. మరోవైపు ప్రత్యర్థి జట్టు స్పెయిన్ ఈ లక్ష్యాన్ని రెండు బంతుల్లోనే చేదించింది అని చెప్పాలి. ఈ విషయం తెలిసి క్రికెట్లో ఇలాంటివి కూడా జరుగుతాయా అని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: