ఇటీవల సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మహిళల టి20 వరల్డ్ కప్ లో భాగంగా మరోసారి ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ కప్లలో ఛాంపియన్గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా మరోసారి ఆ బిరుదుని నిలబెట్టుకుంది అని చెప్పాలి. ఇక మొదటి నుంచి మంచి ప్రదర్శన చేస్తూ ఫైనల్ కు దూసుకు వెళ్లిన ఆస్ట్రేలియా.. మొదటిసారి ఫైనల్ కు వచ్చిన సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. దీంతో మరోసారి విశ్వవిజేతగా తమ పేరు మారి మోగిపోయేలా చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు.


 బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగం లో కూడా మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ల ప్రదర్శన పై ఎంతో మంది ప్రశంసలు కూడా కురిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఒక అరుదైన రికార్డును కూడా సాధించింది. అదే సమయంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీం కి కెప్టెన్ గా కొనసాగుతున్న లానింగ్ సైతం రికార్డు సృష్టించింది అని చెప్పాలి.


 అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి కెప్టెన్ గా లానింగ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్లేయర్ నాయకత్వంలోనే ఆస్ట్రేలియా జట్టు అయిదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 2014, 2018, 2020, 2023 మహిళల టి20 వరల్డ్ కప్ ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించింది అని చెప్పాలి. తనదైన వ్యూహాలతో ఎప్పుడు ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఇక మ్యాచ్ పరిస్థితిలను తన వైపుకు తిప్పుకొని జట్టును గెలిపించింది. అయితే లానింగ్ తర్వాత ఇక ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ నాలుగు ఐసీసీ ట్రోఫీలతో తర్వాత స్థానంలో ఉండగా.. ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మూడు ఐసీసీ ట్రోఫీలతో మూడో స్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: