టీమిండియాలో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్  గత ఏడాది డిసెంబర్లో గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని తన తల్లిని కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఏకంగా రూర్కీ ప్రాంతంలో అతని కారు ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడింది. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో అతని కారు పూర్తిగా దగ్ధం అవ్వగా.. ఇక ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పంత్ కారు నుండి దూకేయడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు అని చెప్పాలి.


 అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు అతన్ని సరైన సమయం లో ఆసుపత్రికి తీసుకువెళ్లడం తో ఇక ప్రాణా పాయం  తప్పింది. అయితే మొన్నటి వరకు ముంబై లోని ధీరుబాయ్ అంబానీ కోకిల బెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు రిషబ్ పంత్. అతని మోకాలికి సర్జరీ కూడా అయింది అని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో మెడకు కూడా సర్జరీ కావాల్సి ఉంది. అయితే తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో  రిషబ్ పంత్ కోలుకోవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది అని క్రికెట్ నిపుణులు కూడా అంచనా వేశారు.. ఈ క్రమంలోనే ఇక టీమిండియా అతను లేకుండానే ఎన్నో సిరీస్ లు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే రిషబ్ పంత్ త్వరగా కోలుకొని మళ్ళీ జట్టు  లోకి వస్తాడని అభిమానులు అందరూ ఆశపడుతున్న వేళ.. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ పంత్ అభిమానులందరికీ గుండెలు పగిలే వార్త చెప్పాడు. పంత్ తిరిగి టీమిండియా లో ఆడెందుకు దాదాపు రెండేళ్లయిన పడుతుంది అని అంచనా వేశాడు సౌరవ్ గంగూలీ. ఇక ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లో పంత్ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని గంగూలీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: