ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ జరిగాయి. అయితే స్వదేశీ పరిస్థితిలను ఎంతో బాగా వినియోగించుకుంటున్నటువంటి ఇండియా జట్టు అటు ఆస్ట్రేలియా పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా భారత బౌలింగ్ విభాగం మ్యాజిక్ చేస్తూ ఆస్ట్రేలియాను దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. దీంతో ఇక వరుసగా రెండు మ్యాచ్లలో కూడా ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది అని చెప్పాలి.


 అయితే టీమిండియా వరుసగా రెండు మ్యాచ్లలో అయితే గెలిచింది. కానీ ఇక అటు జట్టులో బ్యాటింగ్ వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. రెండు టెస్ట్ మ్యాచ్లు నాలుగు ఇన్నింగ్స్ లలో కూడా తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయాడు. అంతకుముందు కొన్ని మ్యాచ్ల నుంచి కూడా ఇదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో అతన్ని మిగిలిన రెండు టెస్టులకు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అయితే జట్టు నుంచి పక్కకు పెట్టడానికి ఇలా వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించారు అన్న వాదన కూడా వినిపిస్తోంది.


 మూడో టెస్ట్ లో రాహుల్ స్థానంలో మంచి ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ను తీసుకోవడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఇదే విషయంపై అటు మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్పందించారు. స్వదేశంలో పరుగులు చేయకపోతే ఎవరిపైన విమర్శలు వస్తాయి అంటూ వ్యాఖ్యానించాడు. కేఎల్ రాహుల్ ఒక్కడే కాదు గతంలో చాలామంది ఆటగాళ్లకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్లేయర్స్ పై చాలా ఒత్తిడితో పాటు ఎక్కువ ఫోకస్  ఉంది. టీం మేనేజ్మెంట్ రాహుల్ను జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా భావిస్తుంది. అంతిమంగా కోచ్ కెప్టెన్ ఏమనుకుంటున్నారు అన్నదే ముఖ్యం. రాహుల్ ప్రతిభవంతుడైన ప్లేయర్. కానీ ఇండియా తరఫున ఆడుతున్నప్పుడు ఇంకా బాగా ఆడాలని అభిమానులు కోరుకుంటారు. విఫలమైనప్పుడు కచ్చితంగా విమర్శలు చేస్తారు  అయితే రాహుల్కు తిరిగి పొందుకునే సత్తా ఉంది అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: