సాధారణంగా సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్ అంటే మిగిలిన రెండు ఫార్మాట్లకు ఎంతో భిన్నంగా ఉంటుంది అని చెప్పాలి. వన్డే, టి20 ఫార్మట్ లో క్రీజు లోకి వచ్చిన బ్యాట్స్మెన్ ఎక్కువ పరుగులు చేయడం ఎలా అని ఆలోచిస్తే అటు టెస్ట్ ఫార్మాట్లో మాత్రం పరుగుల విషయం పక్కన పెట్టి ఇక క్రీజ్ లో వికెట్ను కాపాడుకుంటూ పాతుకుపోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.ప్రతి బ్యాట్స్మెన్. పరుగులు రాకపోయినా పర్వాలేదు. కానీ క్రీజులో ఉండాలని అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఎంతో ఆచితూచి ఆడుతూ వచ్చినప్పుడే పరుగులు చేస్తూ ఉంటారు. అందుకే వన్డే టి20 ఫార్మాట్లో లాగా టెస్టు ఫార్మాట్లో ఆటగాళ్లు రన్ అవుట్ అవ్వడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే రన్ అయ్యే ప్రమాదం ఉంది అని భావిస్తే పరుగు తీయడాన్ని కూడా ఆపేస్తూ ఉంటారు అని చెప్పాలి. రిస్క్ చేసి ఇక పరుగు చేయడం లాంటివి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టు రెండు ఇన్నింగ్స్ లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన జరిగింది అని చెప్పాలి. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ బ్రెస్ వెల్ అవుట్ అయిన తీరు మాత్రం ప్రస్తుతం అభిమానులు అందరిని కూడా ఆగ్రహానికి గురి చేస్తూ ఉంది అని చెప్పాలి.


 158.2 ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్లీచ్ బౌలింగ్ వేసాడు. బ్లెండన్ షాట్ బాది  బ్రేస్వెల్ తో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే మూడో పరుగు కూడా వచ్చే అవకాశం ఉండడంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బ్రేస్ వెల్ రన్ అవుట్ అయ్యాడు. అయితే ఇలా రన్ అవుట్ అయ్యే ప్రమాదం ఉన్నప్పుడు ఎవరైనా సరే తమ బ్యాట్ ను ముందుగా క్రీజులో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ క్రీజు దగ్గరికి చేరినప్పటికీ బ్రేస్ వెల్ మాత్రం బద్ధకం ప్రదర్శించాడు. బ్యాట్ మాత్రమే కాదు బ్రేస్ వెల్ కాలు కూడా గాల్లోనే ఉండడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ చివరికి వికెట్లను గిరాటేశాడు. దీంతో బ్రేస్ వెల్ అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: