విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతోపాటు అటు కేఎల్ రాహుల్ కూడా టీమిండియా జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ వున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత కేఎల్ రాహుల్కు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలోనే జట్టును ముందుకు నడిపించడంలో అటు రోహిత్ శర్మకు కూడా తన వంతు సహాయం చేస్తూ వస్తున్నాడు కేఎల్ రాహుల్. అయితే వైస్ కెప్టెన్ బాధ్యతల గురించి పక్కన పెడితే కేఎల్ రాహుల్ ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం గత కొంతకాలం నుంచి విఫలం అవుతూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఫార్మట్ తో సంబంధం లేకుండా వరుస వైఫల్యాలతో అభిమానులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు.


 అయినప్పటికీ జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి ఇక వరుసగా తుది జట్టులో అవకాశం ఇస్తూనే ఉంది. ఫామ్ లో ఉన్న యువ ఆటగాళ్లను సైతం అతని కోసం పక్కన పెడుతుంది. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో తుదిజట్టులో ఉన్న కేవలం రాహుల్ ఎక్కడ తన బ్యాట్ తో ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది జట్టు యాజమాన్యం. కాగా ఇక అతన్ని జట్టు నుంచి కూడా పక్కనపెట్టి శుభమాన్ గిల్ ను తీసుకుంటారు అని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేఎల్ రాహుల్ ప్రదర్శన పై ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇలాంటి సమయంలో కె.ఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా తొలగించడంపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. టాలెంట్ ఉన్నవారికి తాము ఎప్పుడూ అండగా ఉంటాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్ గా తొలగించడం పెద్ద విషయమేమీ కాదని తెలిపాడు. జట్టులో సీనియర్లు లేకపోవడం వల్లే కె.ఎల్ రాహుల్కు ఆ బాధ్యతలు అప్పగించాము అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే కేఎల్ రాహుల్ ని వైస్ కెప్టెన్గా తొలగించిన నేపథ్యంలో  ఇక ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: