
మహేంద్ర సింగ్ ధోని ఎలాగైతే టీమిండియాను విజయవంతంగా ముందుకు నడిపించాడో.. ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అదే రీతిలో విజయాలను అందించాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది మాత్రం ఈ ఛాంపియన్ జట్టు పేలవా ప్రదర్శన చేసి నిరాశపరిచింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మాత్రం కప్పు కొట్టడమే లక్ష్యంగా కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ కోసం భారీ ధర పెట్టి మరి జట్టులో చేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ కి అటు చెన్నై సారధ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇలాంటి సమయంలో చెన్నై జట్టుకు ఊహించని షాల్ తగిలింది. ఏకంగా చివరి దశ మ్యాచ్‌ల్లో బెన్ స్టోక్స్ ఐపీఎల్లో ఆడబోడు అని అందరూ భావించారు. కానీ ఇటీవల ఈ విషయంపై గుడ్ న్యూస్ చెప్పాడు బెన్ స్టోక్స్. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని అందరూ అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం అతనికి ఐపిఎల్ లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది అని తెలుస్తుంది. దీంతో ఇక ఏడాది ఐపీఎల్లో అన్ని మ్యాచ్‌లకు కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అందుబాటులో ఉండబోతున్నాడు. కాగా అతని కోసం 16.25 కోట్ల ధర పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్.