భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆతిథ్య భారత్ తో మూడవ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన భారత జట్టు అదిరిపోయే ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై పూర్తి అధిపత్యాన్ని చలాయించి ఘన విజయాలను అందుకుంది. అదే సమయంలో ఇక మూడవ మ్యాచ్ లో కూడా గెలిచి అటు టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని ఆశపడుతుంది భారత జట్టు. అయితే రెండు మ్యాచ్లలో పేలువ ప్రదర్శనతో నిరాశపరిచిన ఆస్ట్రేలియా మూడో మ్యాచ్లో మాత్రం గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.


 నేటి నుంచి ఇండోర్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మరోసారి స్పిన్  ప్రధాన అస్త్రంగా  భారత జట్టు బరిలోకి దిగుతుంది. అయితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్ గెలిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని మరోసారి టీమిండియా సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి. దీంతో ఈ సిరీస్లో మరోసారి భారత జట్టుదే ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే గత మూడు బోర్డర్ గావాస్కర్ ట్రోఫీను కూడా భారత జట్ట గెలుచుకోవడం గమనార్హం. దీంతో ఇక ఇప్పుడు కూడా బోర్డర్ గవాస్కర్  ట్రోఫీ గెలిస్తే టీమిండియా చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఒక వైపు సిరీస్ మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఛాన్స్. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని చెప్పాలి.


 అయితే ఇంతకుముందు జరిగిన వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో.. ఇక అటు కేఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించారు అన్న విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టులో అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నది కూడా అనుమానంగా మారిపోయింది. అయితే అతని స్థానంలో ఎవరికి వైస్ కెప్టెన్సీ అప్పగిస్తారు అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక మరికొంత సేపట్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: