ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయ్. రెండు మ్యాచ్ లలో కూడా భారత జట్టు విజయం సాధించింది. స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకుని అద్భుతంగా రానిస్తున్న టీమిండియా జట్టు అటు ప్రత్యర్థి ఆస్ట్రేలియను ముప్పు తిప్పలు పెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథంలో ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియాలో రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే భారత్ స్పిన్ పిచ్ లపై పేలువ ప్రదర్శనతో ఆస్ట్రేలియా బ్యాటర్ విఫలమవుతున్న వేళ సిరీస్ ను భారత జట్టు ఎంతో సులభంగా గెలిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు అని చెప్పాలి. భారత జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్  4-0 తేడాతో క్లీన్స్వీప్ చేయడం ఖాయం అంటూ స్పష్టం చేశాడు. అయితే సౌరబ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడు అని చెప్పాలి.


 సౌరబ్ గంగూలీ అంచనానే నిజమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. నిజంగానే ఆస్ట్రేలియాను భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందంటే అవుననే సమాధానం చెబుతాను. ఎందుకంటే అది జరగకుండా ఆపడం ఎలాగో నాకు కూడా తెలియడం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు పాత ఆస్ట్రేలియన్ జట్టుతో పోల్చడం.. గతంలో టీంలు ఇప్పుడు టీం ఒకేలా లేదు.. మ్యాత్యు హెడెన్, జస్టిన్ లంగర్, రికీ పాంటింగ్, స్టీవ్ వా ఇలా దిగ్గజ ప్లేయర్లు జట్టులో కనిపించడం లేదు. అంత క్వాలిటీ కూడా లేదు అంటూ మైకల్ క్లార్క్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: