టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొన్నాళ్ల క్రితం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రమాదం తర్వాత మంచానికి పరిమితమైన పంత్ చాలా వేగంగా కోరుకుంటున్నాడు. ఇలాగే మరి కొన్నాళ్లపాటు వైద్యం తీసుకుంటే అతి త్వరలోనే తన ఆరోగ్యం బాగవుతుందని ఫిట్ నెస్ సాధిస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు రిషబ్ పంత్. ఇప్పుడు తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని, వైద్య సిబ్బంది తోడ్పాటు, దేవుడి దయ వల్ల ఫిట్నెస్ పై దృష్టి పెట్టబోతున్నట్టు పంత్ తెలుపుతున్నాడు.

ఇక చాలా మంది జీవితంలో ఏదో సాధించాలని చాలా కష్టపడుతూ ఉంటారని కానీ వారి దైనందిన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలలో కలిగే ఆనందాన్ని కోల్పోతున్నారని తెలిపాడు పంత్. ప్రస్తుతం తాను పళ్ళు తోముకోవడంతో పాటు ప్రతిరోజు వేకువజామున ఆరు బయట కూర్చోవడం, ఎండను ఆస్వాదించడం లాంటివి వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నానని ఇవి చాలా నాకు సంతోషం ఇస్తున్నాయని తెలుపుతున్నారు. ప్రమాదం తర్వాత తాను జీవితాన్ని చూసే కోణం మారిందని, ప్రతి రోజును బాగా ఆస్వాదిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదం తనను ఎంతగానో మార్చిందని ప్రతి విషయాన్ని అనుకూలంగా లేకపోయినా ప్రతికూలంగా కూడా ఉండాల్సిన అవసరం లేదంటూ పంత్ తెలియజేశారు.

తన ఆరోగ్యం మెరుగైన వెంటనే క్రికెట్ పై దృష్టి సారిస్తానని, అదే తనకు ప్రస్తుతం తీరని లోటుగా ఉందని, త్వరగా టీమ్ఇండియా కు మళ్ళీ ఆడాలని తాను ఆరాటపడుతున్నట్టుగా చెప్పాడు. అభిమానులంతా ఢిల్లీ టీం కి మరియు ఇండియా టీం కి మద్దతును ముందులాగే కొనసాగించాలని కూడా పంత్ కోరుకుంటున్నాడు. కాగా రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఎన్నో సిరీస్ లకు దూరమాయ్యాడు. పంత్ లాంటి ప్లేయర్ లేకుండానే ఈ ఏడాది టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఆడబోతుంది అని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: