మరికొన్ని రోజుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి సీజన్లో మహిళా క్రికెటర్లు అందరూ కూడా ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఎలా ప్రేక్షకులను ఆకర్షించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాదు ఇక మొదటి సీజన్ నుంచే ఎవరు అద్భుతంగా రానించి రికార్డుల వేట ప్రారంభించబోతున్నారు అన్న విషయం తెలుసుకోవడానికి కూడా అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.


 అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేనందున ఇక అటు అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్టు కెప్టెన్ వైస్ కెప్టెన్ వివరాలను కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు పదునైన వ్యూహాలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక తుది జట్టులో ఎవరిని ఆడించాలి అనే విషయంపై కూడా అన్ని జట్లు  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గురించి ఎంతోమంది మహిళా క్రికెటర్లు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత మహిళా జట్టు ప్లేయర్ అయిన జెమియా రోడ్రిక్స్ స్పందించింది.


 ఈ క్రమంలోనే  సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం గురించి మాట్లాడింది. టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఓటమి తమను ఇంకా వెంటాడుతుంది అంటూ జమియా రోడ్రిక్స్ చెప్పుకొచ్చింది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆడటం ద్వారా ఆ బాధ నుంచి బయట పడేందుకు అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ టోర్నీ పై దృష్టి సారించడం ద్వారా మాలో ఉన్న నెగటివ్ ఆలోచనలను దూరం చేసుకోవచ్చు. మేము మరింత కష్టపడతాం. అయితే ఈ టోర్నీ ద్వారా ప్రతిభగల ప్లేయర్లు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది అంటూ అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: