ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకున్న భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది అని చెప్పాలి. ఇలా జోరు మీద ఉన్న భారత్ మూడో మ్యాచ్లో కూడా విజయం సాధించడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించిన రీతిలో స్వదేశంలోనే టీమ్ ఇండియాను దెబ్బ కొట్టింది ఆస్ట్రేలియా.


 రెండు మ్యాచ్లలో ఓడిపోయి నిరాశలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇక మూడో తమలో ఉన్న కసి మొత్తాన్ని చూపించింది. ఇక టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పాలి. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఎక్కడా టీమిండియా కు గెలిచేందుకు అవకాశం ఇవ్వలేదు. అటు ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం ముందు టీమిండియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేసి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నాలుగో టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ కైపసం కావడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.



 ఇకపోతే భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జరిగిన ఇండోర్ పిచ్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్ పిచ్ అంటూ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఈ రేటింగ్ ఇచ్చింది అన్నది తెలుస్తుంది. పిచ్ చాలా తడిగా ఉందని.. బ్యాట్ బాల్ మధ్య బ్యాలెన్స్ లేదు అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇండోర్ లోని పిచ్ ఆరంభం నుంచి కూడా స్పిన్నర్లకి అనుకూలించింది అంటూ చెప్పుకొచ్చాడు. సీమ్ మూమెంట్కు అసలు అవకాశం లేదు అంటూ తెలిపాడు. మ్యాచ్ మొత్తం కూడా ఊహించినంత బౌన్స్ రాలేదు అంటూ ఫిర్యాదు చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: