ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో ఐదు సార్లు టైటిల్ గెలిచి అత్యధిక సార్లు ట్రోఫీ గెలుచుకున్న టీం గా కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం భారత కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ అటు ముంబై ఇండియన్స్ కి సారధ్య బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా ఐపిఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా ఉంది ముంబై ఇండియన్స్. అదే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ  ఇక ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఒక టీం గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.


 ఐపీఎల్ లో ఎలా అయితే ముంబై ఇండియన్స్ మంచి ప్రదర్శన చేసి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అదరగొడుతూ ఉంటుందో.. ఇక ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ముంబై ఇండియన్స్ జట్టు అదే రీతిలో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది ముంబై ఇండియన్స్. ఇక ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి సూపర్ విక్టరీ సాధించింది అని చెప్పాలి. భారీ టార్గెట్ తోనే బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఎంతో అలవోకగా టార్గెట్ ను చేదించేసింది. 14.2 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి విజయం సాధించింది.


 ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.  ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 156 పరుగులు చేసింది. అయితే భారీ టార్గెట్ తోనే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగింది. మొదటి నుంచి దూకుడుగానే ఆడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే హేలి మాథ్యూస్, నాట్ స్కీవర్ బెంగళూరు బౌలర్ల పై ఫోర్లు సిక్సర్లతో  విరుచుకుపడ్డారు. హేలి 38 బంతుల్లో 77 పరుగులు చేయగా.. నాట్ స్కీవర్ 29 బంతుల్లో 55 పరుగులు చేసింది. దీంతో 14.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేశారు ముంబై బ్యాటర్లు. ఇక బెంగళూరు బౌలర్ ప్రీతి మాత్రమే ఒక వికెట్ పడగొట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: