సాధారణంగా టోర్నీలో బాగా రాణించిన  జట్టుకు ఊహించిన రీతిలో పాపులారిటీ రావడం చూస్తూ ఉంటాం.  కానీ టోర్నీలో పెద్దగా రాణించకపోయినా.. ఇక ప్రతి సీజన్లో అంచనాలను అందుకో లేకపోయినా ఆ జట్టుకు దాదాపు పాపులారిటీ  రాదు అని చెప్పాలి. పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండదు. కానీ ఐపీఎల్ లో ఆర్ సి బి  జట్టు విషయంలో మాత్రం ఇదంతా తారుమారు అయింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆర్సిబి జట్టు టైటిల్ గెలవలేదు. స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ గా పేరుగాంచిన ప్లేయర్ సారథ్యం వహిస్తూ ఉన్నప్పటికీ జట్టుకు ఐపీఎల్ టైటిల్ గెలవడం అనేది ఒక కలగానే మిగిలిపోయింది.


 ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగడం.. ఇక ఆ తర్వాత అభిమానులను నిరాశపరచడం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇలా ఒక్కసారి కూడా కప్పు గెలవక పోయినప్పటికీ ఛాంపియన్ జట్లతో సమానంగా ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ జట్టు. అయితే ఐపీఎల్ లో గత 15 ఏలుగా నిరుత్సాహ పరుస్తూనే ఉన్న ఈ జట్టు.. ఈ ఏడాది ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తుంది. లీగ్ మారినా కూడా ఆర్సిబి ఆట తీరు మారలేదు. తొలి రెండు మ్యాచ్ల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది. జట్టులో ఎంతమంది స్టార్లు ఉన్నా ఎందుకో ఆర్సిబి ఐపీఎల్ సెంటిమెంట్ నే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా కొనసాగిస్తుంది.


 దీంతో అటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అయినా ఆర్సిబి టైటిల్ గెలుస్తుందేమో అనుకుని ఆశలు పెట్టుకున్న అభిమానులు.. ఇక ఎప్పుడు వరుస పరాజయాల నేపథ్యంలో నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ అందరూ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ అసలు ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఆర్సిబి ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: