ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా భారత జట్టు సత్తా చాటుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన భారత జట్టుకు అటు మూడో మ్యాచ్ లో మాత్రం చివరికి నిరాశ మిగిలింది. ఎందుకంటే ఇక ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పుంజుకున్న ఆస్ట్రేలియా జట్టు.. టీమ్ ఇండియా గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే సొంత గడ్డపైనే భారత జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది అని చెప్పాలి.



 అయితే ఇక మూడో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ గెలుచుకుంటుంది అనుకున్నప్పటికీ భారత అభిమానులకు నిరాశ మిగిలింది. అయితే ఇక మూడో టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడంపై ఎంతో మంది భారత మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇదే విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్ర సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండోర్ లో జరిగిన మ్యాచ్లో భారత జట్టులో ఉన్న అతి విశ్వాసమే మ్యాచ్ ఓటమికి కారణమైంది అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే మాజీ కోచ్ రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. అన్ని మ్యాచ్లలో కూడా తాము బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బయట వ్యక్తుల కామెంట్స్ ని పట్టించుకోము అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తమది అతి విశ్వాసం కాదు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇక ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బెస్ట్ పర్ఫామెన్స్ ఇవ్వాలని ప్రతి క్రికెటర్ మైండ్ లో ఉంటుంది అంటూ రోహిత్ తెలిపాడు. కాగా రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: