గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి . అయితే ధోని తర్వాత అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్నాడు. ఇక కోహ్లీ తర్వాత కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు అన్న విషయంపై మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు రిషబ్ పంత్ భారత ఫ్యూచర్ కెప్టెన్ అని ఎంతోమంది భావించారు. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ పేరు కూడా తెరమీదికి వచ్చింది అని చెప్పాలి.


 ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి భారత జట్టు కెప్టెన్సీని భవిష్యత్తులో అప్పగించే అవకాశం ఉంది అని అందరూ అనుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో గత ఏడాది గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి మొదటి ప్రయత్నంలోనే  టైటిల్ అందించాడు హార్థిక్ పాండ్య. దీంతో అప్పటివరకు కెప్టెన్సీ రేస్ లో ఎక్కడ వినిపించని హార్దిక్ పేరు అందరిని వెనక్కినట్టు ముందు వరుసలోకి వచ్చేసింది. ముందు వరుసలోకి రావడమేనా ఏకంగా రోహిత్ కు విశ్రాంతి ప్రకటించినప్పుడు హార్దిక్ టి20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యాడు.


 ఇంకేముంది రోహిత్ వారసుడు అతడే.. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ కూడా అతడే అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అనే చర్చలో నేను హార్దిక్ పాండ్యాకే ఓటేస్తాను అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. సారధిగా హార్దిక్ పాండ్యా టీమ్ మెంబర్స్ తో ఎంతో కంఫర్ట్ గా ఉంటాడని చెప్పుకొచ్చాడు. అతను ఆటగాడి దగ్గరికి వెళ్లి అందరితో మాట్లాడే విధానం.. వారికి ఎంతగానో ఓదార్పుని ఇస్తుంది అంటూ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యాను ఒక గేమ్ చేజర్ అంటూ అభివర్ణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: